
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం విశ్వాసనియ సమాచరంతో దేవేంద్ర విద్యాలయం సమీపంలో ఉన్న లక్ష్మీ లాడ్జ్ లో పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసుల దాడులు నిర్వహించారు. దాడిలో ఆరుగురి ని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు, వారి వద్ద నుండి 15000 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని పహాడి షరీఫ్ పోలీసులకు అప్పగించారు. పట్టు బడ్డ వారిలో 1.సలింద్రి మల్లేష్ 2. ఉల్ల సురేష్ (మంఖల్) 3.డబ్బీకార్ చంద్ర శేఖర్ 4.పాశం కిరణ్ (తుక్కుగూడ) 5.మంగలి యాదగిరి 6.బుద్ధం ప్రవీణ్ (ఉప్పు గూడ)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పేకాట స్థావరాలపై పోలీసుల నిఘా పెంపు
ఈ తరహా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట కేంద్రాలు యువతను చెడు మార్గానికి దారితీస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఇటువంటి ఆకస్మిక దాడులను మరింత పటిష్టంగా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. పేకాట మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Read also : రాహుల్ కు దూరంగా.. NDA కి సానుకూలంగా.. చివరికి జగన్ ఎటువైపు?
Read also : Tahsildar corruption : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన తహశీల్దార్