క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మల్కాజ్‌గిరి (రాచకొండ) కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ SOT, కంటోన్మెంట్ జోన్ పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో 164.86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కేసులో ఒడిశాకు చెందిన నబిన్ సబర్ (28), సుధాకర్ మండల్ (27) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు డ్రైవర్లుగా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, కారు మరియు మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు ₹41.21 లక్షలు ఉంటుందని నిందితులు ఈ గంజాయిని ఒడిశా నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలోని నల్గొండ ధర్మకాంత వద్ద పట్టుబడ్డారు.
గతంలో కూడా హైదరాబాద్ పోలీసులు వేర్వేరు ఆపరేషన్లలో ఇదే తరహాలో 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
