ఆస్ట్రేలియా దేశంలో ఒక కీలక నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా చిన్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా అనేది పిల్లలకు హాని చేస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆస్ట్రేలియా దేశ ప్రధాని చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై పార్లమెంటులో చట్టం ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆమోదించిన 12 నెలల తర్వాత అమలులోకి కూడా వస్తాయని తెలిపారు. కాబట్టి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పై చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని దేశాలతో పాటు మన భారతదేశంలోని కూడా ఇలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మరి కొంతమంది ఇలాంటి నిర్ణయం వెంటనే తీసుకోవడం వల్ల ఇప్పటికే సోషల్ మీడియాలకు అలవాటు పడిన చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డిప్రెషన్ కి వెళ్లేటువంటి ఆస్కారం ఉందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే ఇలాంటి కీలక నిర్ణయాలు మన భారతదేశంలో తీసుకుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.