
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్యకాలంలో చాలా మంది రాత్రి సమయంలో గురక పెడుతూ నిద్ర పోతుంటారు. సాధారణంగా వయసు అయిపోయిన వారు.. లేదా ఇతర అనారోగ్యాలు బారిన పడిన వారు మాత్రమే ఇలా గురక పెడుతారు అని వైద్యులు చెబుతుంటారు. కానీ ఈమధ్య యువతలో కూడా ఈ గురక సమస్య విపరీతంగా కనిపిస్తుంది అని చెబుతున్నారు. సాధారణంగా గురక అనేది గాఢ నిద్రకు సంకేతంగా చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే గురక పెట్టే వాళ్ళు బాగా నిద్రపోతారు అని అనుకుంటారు. ఈ గురక వల్ల పక్కన వారికి చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. అయితే గురక అనేది మంచిది కాదు.. గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడడం వల్లనే వస్తుంటుంది అని.. దీనివలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాడ నిద్ర అనేది అసలు పట్టదు అని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు కూడా గురక పెడుతున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో లేదా మీ కుటుంబంలో మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఎక్కువగా గురక పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని అయితే సంప్రదించమనండి. ఎందుకంటే గురక అనేది చాలా చిన్న విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లైట్ తీసుకుంటారు. కానీ ప్రతిసారి గురక పెడుతున్నట్లయితే అది కొన్ని అనారోగ్యపు సమస్యల ప్రమేయమే అని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి అతి గురక గాడ నిద్రకు సంకేతం అని ఎవరు అనుకోవద్దు. అది ఒక అనారోగ్యపు సమస్య అని గుర్తుంచుకోండి. ఎప్పుడో ఒకసారి గురక పెట్టినట్లయితే అది పెద్ద సమస్య ఏం కాదని.. శ్వాస కు అడ్డంకులు కలగడం వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.
Read also : ఏందయ్యా ఇంత ఘోరమా.. టెస్టుల్లో అతి చెత్త రికార్డు మనదే!
Read also : Political: దేశంలో అత్యధిక కాలం పాలించిన చీఫ్ మినిస్టర్స్





