
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జల ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ అలాగే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తిన అధికారులు తాజాగా మరొక హెచ్చరికలను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద మెల్లిమెల్లిగా పెరుగుతుందని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇన్ఫ్లో మరియు ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపింది. దీంతో పంట్లు మరియు నాటు పొడవులతో ఎవరూ కూడా కృష్ణా నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరద నీటిలో ఈతకు వెళ్లడం లేదా చేపలు పట్టడం వంటివి చేయకూడదని హెచ్చరించింది. వరద పెరుగుతున్న కారణంగా.. ఇలాంటి హెచ్చరికలను ముందుగానే అధికారులు జారీ చేశారు. అలాగే అత్యవసర సహాయం కోసం కొన్ని నెంబర్లను కూడా ఇచ్చారు. 1070, 112, 18004250101 ఈ మూడు టోల్ ఫ్రీ నెంబర్లలో దేనికైనా సరే అత్యవసరమైన సమయంలో సంప్రదించాలని సూచించారు.
జడ్చర్లలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం – ఐదుగురు బాలురపై కేసు
ఇక తాజాగా శ్రీశైలం డ్యామ్ మరియు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా చాలామంది యాత్రికులు డ్యామ్లను చూడడానికి ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో ఒకవైపు శ్రీశైలం మరోవైపు నాగార్జునసాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి ఉధృతంగా ప్రవహిస్తున్న నదులలో లేదా డ్యామ్స్ వద్ద ఎవరూ కూడా నీటిలో పడవలలోను లేదా చేపలు పట్టడానికి వెళ్లకూడదని APSDMA అధికారులు హెచ్చరిస్తున్నారు.