నిద్రపోతున్న నిఘానేత్రలు.. రెండు నెలలుగా స్తంభాలకు వేలాడుతున్న సి సి కెమెరాలు

✍️-పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం
✍️-నేరాలను అరికట్టడానికి ప్రధాన పాత్ర వహిస్తున్న సి సి కెమరాల పరిస్థితి
✍️-ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం…
✍️-నేరస్తులను గుర్తించే సిసి కెమెరాలను అమర్చాలని ప్రజల డిమాండ్
✍️-నిఘా వ్యవస్థ నిద్రిస్తే…. క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది

మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- నేరస్తులను అరికట్టడానికి నేరస్తులను సులువుగా పట్టుకోవడానికి పోలీసులకు త్రినేత్రంగా ఉపయోగపడే నిఘా నేత్రాలు (సిసి కెమెరాలు) స్తంభాలకు వేలాడుతున్న దృశ్యం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైదరాబాద్ నుండి రావిర్యాలకు వెళ్ళే ప్రధాన రోడ్డులో రెండు సిసి కెమెరాలు కామన్ స్తంభానికి గత రెండు నెలలుగా స్తంభాలకు వేలాడుతున్నాయి. కెమెరాల పర్యవేక్షణ మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది కానీ సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా..అని చూడడంలో ఆగమరించారు.ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్న పోలీసుల తీరును చూసి ప్రజలు అవక్కు చెందుతున్నారు. రావిర్యాల నుండి హైదరాబాద్ కు రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాక పోకలు జరుగుతుంటాయి..రాత్రి 12 గంటల తర్వాత హైదరాబాద్ నుండి కొందరు యువకులు అమ్మాయిలను తీసుకొచ్చి రావిర్యాల చెరువుకట్టపై మద్యం సేవిస్తూ రీల్స్ చేస్తూ అసభ్యకరంగా బైకుల పై విన్యాసలు చేస్తూ రావిర్యలకు వెళ్ళే వారిని అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ప్రజలను ఇబ్బందు పెట్టే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రావిర్యల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

India vs Pakistan T20: వెనక్కి తగ్గిన పాకిస్తాన్, భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకారం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button