తెలంగాణరాజకీయం

హస్తం పార్టీలో చెంపదెబ్బలు - ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ

  • ఎమ్మెల్యే బండ్ల, ఎంపీ మల్లు రవి మధ్య విభేదాలు

  • కొట్టుకునేదాకా వచ్చిన టి.కాంగ్రెస్‌ వ్యవహారాలు

  • ఎంపీ మల్లు రవి తీరుపై తీవ్ర విమర్శలు

  • మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యేపై ఎంపీ దాడి!

క్రైమ్‌ మిర్రర్‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొట్లాటలు తారాస్థాయికి చేరాయి. కేబినెట్‌ మంత్రి సమక్షంలోనే ఓ ఎమ్మెల్యే చెంపను ఎంపీ చెల్లుమనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో సీఎం రేవంత్‌ తర్వాత నెంబర్‌ 2గా భావిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం. నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, గద్వాల్ఎ మ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒకరినొకరు చేయి చేసుకోవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

సముద్రంలాంటి కాంగ్రెస్‌లో నేతల మధ్య కొట్టాలు ఇప్పటివి కావు. అయితే తెలంగాణలో ఇటువంటివి కొంత అరుదే. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒకరినొకరు చేయిచేసుకోవడం ఇప్పుడు ట్రెండింగ్‌ ఇష్కూ. పూర్వా పరాల్లోకి వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యకు అసలు పడటంలేదు.

ఈ క్రమంలో జిల్లాలో అధికారులు సరితా తిరుపతయ్యకు అధిక ప్రాధాన్యమివ్వడం ఎమ్మెల్యే బండ్లకు అసలు మింగుడుపడటంలేదు. దీంతో జిల్లాలో బండ్ల వర్సెస్ సరితా తిరుపతయ్యగా రాజకీయం మారిపోయింది. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలన్నీ ఎలాంటి ఫలితం లేకుండానే జారిపోయాయి. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో సరితా తిరుపతయ్యను స్టేజీ మీదకు రాకుండా, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తన ముందే ఎంపీ మల్లు రవి ఆమెను వేదికపైకి పిలవకపోవడంతో తాజా కొట్లాటకు దారితీసింది.

భూభారతి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు తిరుపతయ్యనూ ఎంపీ మల్లు రవి వేదిక మీదకు పిలిచారు. అయితే తనకంటే వారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని అక్కడే బండ్ల నిలదీసినట్లు తెలిసింది. అక్కడే ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగిందట. అనంతరం కారులో వెళ్తుండగా సహనం కోల్పోయిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్లను చెంపమీద గట్టిగా కొట్టినట్లు తెలుస్తోంది. హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి ఎంపీపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఊహించని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చొగా మౌనంగా ఉండిపోయారని, ఆపేందుకు కూడా యత్నించలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button