
క్రైమ్ మిర్రర్, నూతనకల్:-
మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు.సోమవారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ 18 మంది పట్టుబడినట్లు ఎస్సై సాయిరాం తెలిపారు.వీరిని సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఇద్దరికి రెండు రోజులు, మరో నలుగురికి ఒక్క రోజు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.2,000/- జరిమానా మరో పన్నెండు (12) మందికి కలిపి రూ.16,500/- జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ కింద పడి భార్య మృతి.. యాసిడ్ తాగి భర్త సూసైడ్
ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల అంటీతో 25 ఏళ్ల యువకుడి పెళ్లి.. టిఫిన్ బాగాలేదని సూసైడ్