తెలంగాణ

డేంజర్‌లో సింగూరు డ్యామ్‌.. ఎప్పుడైనా గండి పడొచ్చు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- సింగూరు డ్యామ్‌ భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. డ్యామ్‌కు ఎప్పుడైనా గండి పడొచ్చని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే రిపేర్లు చేయకపోతే.. డ్యామ్‌కు ముప్పే అంటున్నారు. మరి డ్యామ్‌ భద్రత కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టబోతోంది…? అసలు ఇంత సడెన్‌గా సింగూరు ప్రాజెక్ట్‌ ఆనకట్ట ఎందుకు కుంగింది…? దీనికి బాధ్యులు ఎవరు…? బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన తప్పిదం వల్లే సింగూరు డ్యామ్‌ డేంజర్‌లో ఉందా…? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read also : పుతిన్‌ తో భేటీకి జెలెన్‌ స్కీ.. ట్రంప్ ప్రయత్నం!

సింగూరు ప్రాజెక్ట్‌… హైదరాబాద్‌తోపాటు మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు తాగునీరు, సాగునీటిని అందిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ప్రమాదంలో ఉంది. డ్యామ్‌ ఆనకట్ట కుంగింది. వెంటనే రిపేర్లు చేయించకపోతే.. నేడు, రేపో తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ మాట… డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ పానెలే చెప్పింది. యుద్ధప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని సూచించింది.

Read also : మేం మునిగితే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్‌ ఆర్మీ చీఫ్‌

సింగూరు డ్యామ్‌ పైభాగంలో రాళ్లతో కూడిన రివిట్‌మెంట్‌ దెబ్బతింది. ఆనకట్టుకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువున చీలక వచ్చింది. ఒకవైపు గోడ వంగి ఉంది. వీటికి వెంటనే రిపేర్‌ చేయకపోతే.. మొత్తం ప్రాజెక్టుకే ముప్పు ఉంటుందని హెచ్చరించారు డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ పానెల్‌లోని నిపుణులు. రెండు నెలల క్రితం (జూన్‌లో) సింగూరు ప్రాజెక్ట్‌ కింద ఉన్న మంజీరా బ్యారేజీ ప్రమాదంలో ఉన్నట్టు రాష్ట్రానికి చెందిన డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో.. మంజీరా బ్యారేజ్‌ భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ భయం వీడకముందే… ఇప్పుడు సింగూరు డ్యామ్‌కు కూడా ముప్పు పొంచి ఉందంటూ మరో బాంబ్‌ పేల్చింది డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌. ఈ విషయాన్ని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది.

Read also : ఇంటికే మద్యం డెలివరీ, ప్రభుత్వం కీలక నిర్ణయం!

సింగూరు ప్రాజెక్ట్‌ దెబ్బతినడానికి కారణాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. సామర్థ్యానికి మించి నీటిని నిల్వచేయడమే ముప్పునకు కారణమని నిపుణలు చెప్తున్నారు. ప్రాజెక్ట్‌ డిజైన్‌ ప్రకారం చూస్తే 517 మీటర్ల వరకే నీటిని నిల్వచేయాల్సి ఉంది. అయితే… మిషన్‌ భగీరథ అవసరాల కోసం 520 మీటర్ల మేర నిల్వచేసేందుకు 2017లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. అప్పటి నుంచి కొనేళ్లుగా సామర్థ్యానికి మించి.. 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌ తెలిపింది. అందువల్లే డ్యామ్‌ దెబ్బతినిందని నివేదికలో పేర్కొంది. దెబ్బతిన్న రివిట్‌మెంట్‌ని అత్యవసరంగా సరిచేయకపోతే.. ఏక్షణంలో అయినా గండి పడే అవకాశం ఉందని తెలపింది రివ్యూ ప్యానల్‌. డ్యామ్‌కు గండి పడితే చాలా ప్రమాదమని… కింద ఉన్న మంజీరా బ్యారేజ్‌, నిజాంసాగర్‌ కూడా దెబ్బతింటాయని.. వాటితో పాటు చెక్‌ డ్యామ్‌లు కూడా ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ ప్రాతిపదికను మరమ్మతులు చేయించాలని తెలిపింది. అయితే.. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే.. రిపేర్లు చేయాలంటే… ప్రాజెక్టులోని నీటిని బయటికితీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదిరే పనికాదు. కనుక తాత్కాలిక రిపేర్లే చేస్తున్నామన్నారు నిపుణులు. ఇక.. సింగూరు డ్యామ్‌ డేంజర్‌లో ఉందన్న వార్త రావడంతో.. స్థానికులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారు. ఒకే డ్యామ్‌ ఆనకట్టుకు గండి పడితే.. తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన.. అక్కడి వారిలో కనిపిస్తోంది.

Read also : మరో 10 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు అలెర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button