ఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణ

భర్తతో విభేదాలు లేవన్న సింగర్‌ కల్పన - ఆత్మహత్యాయత్నం చేయలేదంటూ వీడియో రిలీజ్‌

సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బెడ్‌పై అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను… స్థానికుల సాయంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. భర్తతో విభేదాల వల్లే కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్‌ పెడుతూ… ఒక వీడియో రిలీజ్‌ చేశారు సింగర్‌ కల్పన. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని… తన భర్తతో విభేదాలు ఏమీ లేవని ఆ వీడియోలో స్పష్టంగా చెప్పారు.

45ఏళ్ల వయసులో తాను పీహెచ్‌డీ (PHD) చేస్తున్నానని, ఎల్‌ఎల్‌బి (LLB) చదువుతున్నానని చెప్పారు కల్పన. అందుకు తన భర్త ఎంతో సహకారం, ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారామె. మ్యూజికల్‌ ఇండస్ట్రీలో మరింతగా రాణించేందుకు…. ఈతరానికి తగ్గట్టుగా అప్‌డేట్‌ అవుతున్నానని అన్నారు. ఇన్ని పనులు చేస్తుండటం వల్లే… కొన్నేళ్లుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నట్టు.. వైద్యుల సూచనతో మెడిసిన్‌ కూడా వాడుతున్నట్టు చెప్పారామె. అయితే.. ఆ మెడిసిన్‌ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల.. ఆపస్మారకస్థితిలోకి వెళ్లానని… ఆత్మహత్యాయత్నం చేయలేదని ఒక వీడియో రిలీజ్‌ చేశారు.

నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకోని అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా…. చికిత్స తీసుకుని ఆమె డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా ఆమె రిలీజ్‌ చేసిన వీడియో చూస్తే… కల్పన ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని అంతా భావించారు. భర్తతో విభేదాలు ఉన్నాయని… కూతురు వ్యవహారం పడక డిప్రెషన్‌లోకి వెళ్లారని కథనాలు వచ్చాయి. అయితే… అవేమీ నిజం కాదని స్పష్టం చేశారు కల్పన.

ఇవి కూడా చదవండి …

  1. మొబైల్ వాడొద్దని చెప్పిన తల్లి… దారుణంగా చంపిన కొడుకు!

  2. జానారెడ్డికి కీలక పదవి.. కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్

  3. ఏసీబీకి పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్

  4. టీడీపీ-జనసేన మధ్య గ్యాప్‌ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!

  5. కిషన్‌రెడ్డి – బండి సంజయ్‌ మధ్య క్రెడిట్‌ వార్‌ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button