
Singer Chinmayi: దక్షిణ భారత ప్లేబ్యాక్ సింగర్, వాయిస్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సామాజిక మాధ్యమాల్లో నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా మహిళల భద్రత, హక్కులు, లైంగిక వేధింపులు, ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలపై ఆమె వినిపించే స్పష్టమైన మాటలు చాలా మందికి ప్రేరణ కాగా, కొందరికి మాత్రం అది అసహనానికి కారణమవుతోంది. అందువల్లే ఆమెను ‘ఫెమినిస్ట్’ అంటూ కొంతమంది నెటిజన్లు తరచుగా విమర్శించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషించడం కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ విమర్శలను ఎదుర్కోవడంలో చిన్మయి ఎప్పటి నుంచో దృఢంగా నిలుస్తూ, ట్రోలర్లకు తగిన సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.
I got a morphed image from a page today and tagged the cops – whether legal action happen will happen or not is not the issue
But I made this video for girls and their families to safeguard against the ‘Lanja Munda’ spewing people here who have been paid to do this for the past… pic.twitter.com/unjeJANNHP
— Chinmayi Sripaada (@Chinmayi) December 10, 2025
ఇటీవలి కాలంలో అయితే ఆమెపై అప్రతిహతంగా జరుగుతున్న ట్రోలింగ్ మరింత తీవ్రమైంది. కొన్ని వ్యక్తులు బాగా ప్రణాళికాబద్ధంగా, డబ్బులు తీసుకుని ఆమె పేరునే లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె వెల్లడించారు. అంతేకాదు, ఒక ఎక్స్ అకౌంట్ నుంచి ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యంగా తయారు చేసిన ఫోటోను షేర్ చేయడంతో చిన్మయి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఆ మార్ఫింగ్ ఫోటోతో పాటు దాన్ని పోస్ట్ చేసిన అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పబ్లిక్‌గా షేర్ చేసి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
చిన్మయి వీడియోలో తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. “గత 8-10 వారాలుగా నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని మరీ ‘ల** ముం*’ అని దూషించడం మనస్ఫూర్తిగా బాధ కలిగించింది. ఈరోజు వచ్చిన మార్ఫింగ్ ఫోటో కూడా అదే కుట్రలో భాగం. ఇది నాకు మాత్రమే కాదు, ఏ మహిళకైనా జరగవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేశాను. అమ్మాయిలు భయపడకూడదు. కుటుంబ సభ్యులకు చెప్పాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి” అని సందేశం ఇచ్చారు.
ఇది మొదటిసారి కాదు. ఇటీవలి నెలల్లో సోషల్ మీడియాలో చిన్మయి, ఆమె భర్త దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌పై కూడా దారుణమైన కామెంట్లు, అసభ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. రాహుల్ మాట్లాడిన ఒక పాత వీడియోను బయటకు తీసి, మంగళసూత్రంపై ఆయన చెప్పిన అభిప్రాయాలను వక్రీకరించి చిన్మయి దంపతులను విమర్శించారు. చిన్మయి దీనికి సమాధానమిస్తూ, “మంగళసూత్రం మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, హింసను ఆపలేదు. పుట్టిన చిన్నారి నుంచి వృద్ధురాలివరకు మహిళలకు సమాజంలో భద్రత అనే భావనే చాలాసార్లు కనిపించదు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల తరువాత నెటిజన్లలో కొందరు మరింత వ్యక్తిగత దాడికి దిగారు. ట్విట్టర్ స్పేస్‌లు పెట్టి నెత్తురు కారేలా విమర్శలు చేయడం, దుర్బాషలాడడం, ‘పిల్లలు పుట్టకూడదు’, ‘పుట్టినా చనిపోవాలి’ వంటి అమానుషమైన వ్యాఖ్యలు చేయడం వరకు వెళ్లిపోయారు. ఈ తీవ్రమైన దాడులు చూసి మానసికంగా బాధపడ్డ చిన్మయి.. చివరికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.
ఇక తాజాగా వైరల్ అవుతున్న ఆమె వీడియోలో.. చిన్మయి మరికొందరు నెటిజన్ల పేర్లను వెల్లడిస్తూ, “ఇలాంటి వ్యక్తుల చేతుల్లో అమ్మాయిల జీవితాలు పెట్టి పెళ్లి చేయాలా?” అని ప్రశ్నించారు. సమాజంలో మహిళల పై ఆన్‌లైన్ వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్న అమ్మాయిలు భయపడకుండా నిలబడాలని, వెంటనే కుటుంబానికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ విస్తృత చర్చకు కారణమవుతోంది.
ALSO READ: Big shock: తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు క్యాన్సిల్





