వేల కోట్ల నిధులు దారి మళ్లించారు
మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో సింగరేణికి కోలుకోలేని దెబ్బ పడిందని రాష్ట్రకార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి విమర్శించారు. గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మందమర్రి ఏరియాలోని ఆర్ కే ఓసీ విస్తరణకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఓసీకి సంంధించి గత సంవత్సరమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని తెలిపారు.
గత బీఆర్ ఎస్ పాలకులు విచ్చలవిడిగా నిధులు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ఈ ఓసీకి సంబంధించి ఫారెస్టు క్లియరెన్స్ కోసం కొంత పెండింగ్‌లో ఉందని త్వరలోనే జిల్లా కలెక్టర్ మొదలు కొని ఫారెస్టు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. ఓసీ విస్తరణ వల్ల పట్టణానికి ఎఫెక్టెడ్్ ఏరియా ఏమి లేవని ఇది ప్రారంభమైతే 18 సంవత్సరాల జీవితకాలం లైఫ్ ఉందని దీనిలోనాణ్యమైన బొగ్గు కూడ ఉత్పత్తి కానుందని తెలిపారు.
మందమర్రి ఏరియాకు ఇది మంచి ప్రాజెక్టు అని తెలిపారు. దీనిపై ఇప్పటికే సింగరేణి దీనికి సంబంధించి అన్ని సిద్దం చేయడం జరిగిందని తెలిపారు.కొంత సమన్వయం లోపంతో ఫారెస్టు అధికారులతో దీనిపై పూర్తి చర్చిస్తానని తెలిపారు. దీని వల్లసింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యగాలు కూడ పెద్ద ఎత్తున లభిస్తాయని తెలిపారు. ఏరియాలోకొన్ని పాత గనులు మూత పడ్డ క్రమంలో దీనికి అనుమతులు త్వరగా ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు.
త్వరలోనే దీనిపై అనుమతులకు సంబంధించి నిర్ణయ ఉంటుందని తెలిపారు. ఒరిస్సాలోని నైని బ్లాక్‌ను టెండర్‌లో దక్కించుకుందో అదే తరహాలో మళ్లీ టెండర్లలో పాల్గొని బ్లాక్‌లను దక్కించుకోవాలని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాలు బొగ్గు పరిశ్రమలకు తీవ్ర దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.
కొంత మంది పెట్టుబడిదారుల కోసం బొగ్గు పరిశ్రమలపై కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని ఇటీవల తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లతో సింగరేణి ఉద్యోగులకు తీరని నష్టమని తెలిపారు. పార్లమెంటులో కూడ తమ పార్టీ అధినేత ఎంపీలు ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున గళమెత్తుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
