
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:-
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులు. కానీ ఒకే పందిరిలో చరో మూడు ముళ్లు ఇద్దరు యువతులకు వేసి, ఆ ఇద్దరితో కలిసి ఏడు అడుగులు వేసిన సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పునరావృతమైంది. ఒకరికి తెలియకుండా మరికరితో ఇలా ఇద్దరు యువతులతో ఏకకాలంలో ప్రేమాయణం సాగించి, చివరకు ఆ ఇద్దరిని ఒకే మండపంలో ఒకేసారి పెళ్లి చేసుకున్న సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
సరిగ్గా ఇలాంటి పెళ్లె ఒకటి జరిగి నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ అదే జిల్లాలో అదే తరహలో మరో పెళ్లి జరగడం విశేషంగా చెప్పవచ్చు. అయితే ఇలా ఒకే యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లిలు జరిపించాల్సి వస్తోందన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏజెన్సీలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెళ్లిళ్లు చోటుచేసుకోవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?
హస్తం పార్టీలో చెంపదెబ్బలు – ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ