కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మహిళా కానిస్టేబుల్, ఆపరేటర్ మృతదేహాలను వెలికి తీశారు. ఎస్ఐ కోసం గాలిస్తున్నారు.
భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. బుధవారం సాయంత్రం నుంచి బిబిపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎస్సై సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా తెలిసింది. పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్సై కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి.ఈ ఇద్దరితో పాటు బిబిపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగురు ఆత్మహత్యకు పాల్పడటం సంచలంగా మారింది.
మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి. 10 సంవత్సరాలుగా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. గతంలో శృతికి పెళ్లయినప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుంది. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ఏం జరిగింది.. ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారాని భావిస్తున్నారు.ఎస్సై సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతిల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్‌కు తెలుసని.. అందుకే అతను కూడా సూసైడ్ చేసుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు.