
-
చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తికి హైకోర్టు చీవాట్లు
-
వ్యక్తిగతంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశం
-
టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి భూ వ్యవహారంలో ఎస్‌ఐ అత్యుత్సాహం
-
వివాదం సెటిల్ చేసేందుకు ఎస్‌ఐ రామ్మూర్తి ప్రయత్నాలు
క్రైమ్ మిర్రర్, నల్లగొండ: సివిల్ మ్యాటర్‌లో తలదూర్చిన చింతపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రామ్మూర్తికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఓ భూమి విషయంలో టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తికి, మరో వ్యాపారవేత్తకు వివాదం నడుస్తోంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఎస్‌ఐ రామ్మూర్తి ప్రయత్నిస్తున్నట్లు శిల్పా చక్రవర్తి దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ భూ వ్యవహారం పూర్తిగా సివిల్ ఇష్యూ అయినప్పటికీ ఎస్‌ఐ ఎందుకు తలదూర్చుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
శిల్పా చక్రవర్తి దంపతులను పీఎస్‌కు పిలిపించి వివాదాన్ని పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై శిల్పా చక్రవర్తి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. శిల్ప దంపతుల పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించొద్దని సూచించింది. ఎస్‌ఐ రామ్మూర్తిని ఈనెల రెండో వారంలో విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
Also Read : జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్ -2 ఇంచార్జ్ ఐజిపి!