వైరల్సినిమా

రిలీజ్ అవ్వకముందే అంత సిద్ధం చేసుకోవాలి కదా.. మూవీ మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఈ మధ్యకాలంలో సినిమా అంటే ఆయా హీరోల అభిమానులకు అది ఒక పండుగ లాంటిది. కానీ అలాంటి ఫ్యాన్స్ ని ఈరోజు కొన్ని మూవీ మేకర్స్ మోసాలు చేస్తున్నాయి అని చాలామంది ఫ్యాన్సు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా ఒక సినిమా నచ్చింది అంటే ఆ సినిమాను రెండు మూడుసార్లు థియేటర్లకు వెళ్లి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంత నెగిటివ్ టాక్ వచ్చిన ఫ్యాన్స్ ధియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. ఇక ఈ సందర్భంలోనే మూవీ మేకర్స్ కొన్ని స్ట్రాటజీలు చేస్తున్నారు. ఏదైనా సరే ఒక సినిమాకు మొదటి రోజు నెగటివ్ టాకు వస్తే రెండవ రోజు ఆ సినిమాకు సంబంధించి మరిన్ని సీన్స్ ఆడ్ చేసి క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ రాజసాబ్ సినిమా కూడా ఇదే దోవలోకి వెళ్ళింది. రాజాసాబ్ సినిమా కొంత నెగిటివ్ టాక్ రావడంతో వెంటనే మేకర్స్ బ్లాక్ బస్టర్ సీన్స్ యాడ్ చేసాము అని.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్ళండి అనేలా కొన్ని ప్రమోషన్స్ చేశారు.

Read also : వ్యక్తిగతంగా పరువు తీసే బదులు కాస్త విషం ఇచ్చి చెప్పండి : కోమటిరెడ్డి

అంటే దీని అర్థం అక్కడ ఒకసారి సినిమాకు వెళ్ళిన వారు కూడా మళ్లీ ఆ సీన్స్ కోసం సినిమాకు వెళ్తారు అని.. ఇక్కడే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మేకర్స్ ఆలోచన విధానం ఉంది. దీంతో ప్రేక్షకులు సైతం తీవ్రస్థాయిలో మేకర్స్ పై మండిపడుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్నప్పుడు ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఎంతవరకు సినిమా సీన్స్ యాడ్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఊరికే వస్తాయా అంటూ చిత్ర బృందాలపై ఫైర్ అవుతున్నారు. ప్రేక్షకుల నుంచి డబ్బులు గుంజుకోవడానికి మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని.. సినిమా బాగుంటే రెండు కాదు మూడుసార్లు అయినా ధియేటర్లకు వెళ్తామని మరోవైపు అభిమానులు ఎన్నోసార్లు నిరూపించారు. కానీ ఇలా సొంత స్ట్రాటజీలు ఉపయోగించకండి అని.. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అని.. డబ్బుల కోసం చీఫ్ ట్రిక్స్ వాడకండి అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button