జాతీయం

పొరపాటున కూడా కార్తీక మాసంలో ఈ మూడు వస్తువులను దానం చేయకూడదు?

కార్తీకమాసం అనగానే ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ఆ మాసం మొత్తం సేద తీరుతారు. ఉదయం లేవగానే స్నానం ఆచారాలను పాటిస్తారు. అలాగే దగ్గరుండేటువంటి ప్రతి శివాలయంలోనూ పూజలు, పురస్కారాలతో కాలాన్ని గడుపుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో ఎన్నో రకాలుగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో కూడా కొన్ని వస్తువులనైతే అసలు దానం చేయకూడదట. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కార్తీక మాసంలో నూనె దానం అనేది అసలు చేయకూడదట. పొరపాటున కూడా కార్తీకమాసంలో ఈ నూనెను దానం చేస్తే ఆ ఇంట్లో ధన నష్టం కలుగుతుందని మన పురాణాలూ చెబుతున్నాయి. వీటితో పాటుగా మనకి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయట.

ఇక రెండవది కార్తీక మాసంలో పసుపు దానం అసలు చేయకూడదట. ఒకవేళ మీరు పొరపాటున ఈ పసుపు అనేది దానం చేయడం వల్ల మీకు గురుదోషం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు గురికావాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీకమాసంలో పసుపు అనేది దానం అసలు చేయకండి.

ఇక మూడవ విషయానికి వస్తే కార్తీకమాసంలో ఇనుము అనేది అసలు దానం చేయకూడదట. ఒకవేళ మీరు పొరపాటున కూడా దానం చేస్తే మీకు శని దోషం అనేది కలుగుతుందట. కాబట్టి మీరు కార్తీక మాసంలో ఇనుము అనేది దానం చేయకండి. విష్ణువుకి కార్తీకమాసం అంటే ప్రీతికరమైన మాసం. కాబట్టి అనవసరమైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కార్తీక మాసంలో ఇలాంటి మూడు వస్తువులను అసలు దానం చేయకండి. మీతో పాటు మీ బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.

Back to top button