
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత కలలు కంటూనే మిగిలిపోతున్నారు. జీవితం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ చాలామంది యువత సిగరెట్లు, మద్యం మరియు డ్రగ్స్ కు అలవాటు పడిపోయి వెనక పడిపోతున్నారు. ఇంకొంతమంది ఉద్యోగాలు చేసేవారు వచ్చిన డబ్బును ఆరోజుకి ఆ రోజే కాజేస్తున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ముందడుగు వేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వాస్తవ ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. ఇంతకీ అదేంటంటే ఒక 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాజాగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటివరకు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పోషించగలిగిన వ్యక్తి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే అతడి వద్ద ఎటువంటి సేవింగ్స్ అనేవి కూడా లేవు. దీంతో ఇక భవిష్యత్తు కాలంలో కుటుంబాన్ని ఎలా పోషించాలని అయోమయంలో పడి.. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది యువతకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేశాడు.
Read also : తాతకు వచ్చే LIC పెన్షన్ తో జీవితాన్ని గడిపిన CSK జాక్ పాట్ ప్లేయర్?
ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్న సమయంలో కచ్చితంగా భవిష్యత్తులో ఏవైనా అవసరం అవుతాయని ముందుగానే ఊహించి కాస్త డబ్బును ఆదా చేసుకుంటూ ఉండాలి అని లేకపోతే చాలా కష్టం అయిపోతుంది అని తెలిపాడు. ఈ రోజుల్లో ఏ ఒక్క కంపెనీలో కూడా ఉద్యోగ భద్రత అనేది ఉండదని కాబట్టి యువత ఆ భ్రమ నుంచి బయటకు రావాలని సూచించాడు. దీంతో కొంతమందిలో కొంతమందికైనా ఈ విషయం లోతుగా అర్థం అయింది. దీంతో ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు థాంక్యూ బ్రదర్ అని అతనికి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలని ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
Read also : 25 కోట్లతో జాక్ పాట్.. తీరా చూస్తే డకౌట్!.. ఆందోళనలో అభిమానులు?





