Honeymoon Horror: హనీమూన్ మర్డర్ 2.0.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త లేపేసిన కిలేడీ!

మేఘాలయ హనీమూన్ మర్డర్‌‌ను తలపించేలా రాజస్థాన్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది.

గత ఏడాది మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ గురించి గుర్తుండే ఉంటుంది. మధ్య ప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ ప్రియుడితో కలిసి హత్య చేసింది. పెళ్లైన నెల రోజుల్లోనే ఈ దారుణానికి పాల్పడింది. అచ్చం ఈ సంఘటనను తలపించేలా రాజస్థాన్‌లో ఓ మర్డర్ జరిగింది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీగంగానగర్‌కు చెందిన అంజు, సంజు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

వాకింగ్ అంటూ తీసుకెళ్లి..

అయితే, వీరి పెళ్లికి అంజు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అదే ప్రాంతానికి చెందిన ఆశిష్ అనే యువకుడితో మూడు నెలల క్రితం పెళ్లి చేశారు. పెళ్లి అయినా కూడా ఆమెకు ప్రియుడిపై ప్రేమ చావలేదు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆశిష్ బతికి ఉంటే తమ ప్రేమకు అడ్డుగా ఉంటాడని భావించి.. చంపి ఒక్కటవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం పక్కా ప్లాన్ వేశారు. జనవరి 30వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆశిష్, అంజు భోజనం చేశారు. ప్లాన్ ప్రకారం అంజు తన భర్తను ఈవినింగ్ వాక్ అని చెప్పి బయటకు తీసుకొచ్చింది. ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్లాన్ ప్రకారం సంజుతో పాటు మరో ఇద్దరు రోడ్డు పక్క పొదల్లో దాక్కున్నారు. ఆశిష్ అక్కడికి రాగానే పొదల్లోకి లాక్కెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. గొంతు నులిమి చంపేశారు. అంజు తన ఫోన్, బంగారు నగలు సంజుకు ఇచ్చేసింది.

రోడ్డు ప్రమాదం అని నమ్మించేలా..

హత్యను రోడ్డు ప్రమాదం అని నమ్మించేలా ఆశిష్‌ను రోడ్డుపై పడేశారు. ఇద్దరినీ వాహనం ఢీకొట్టిందని నమ్మించేలా అంజు కూడా భర్త పక్కన నేలపై పడిపోయింది. ముగ్గురు నిందితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అటు వైపు వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడున్న వారిని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. ఆశిష్, అంజులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆశిష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు గుర్తించారు. అంజుకు సాధారణ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంజును విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా మర్డర్ విషయం బయటపెట్టింది. పోలీసులు అంజుతో పాటు సంజును.. అతడికి సాయం చేసిన మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button