క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి బాక్సింగ్ డే టెస్ట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోవడం జరిగింది. ఇండియా బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా టీం మొత్తం కూడా వికెట్లకు సమీపంలోనే ఫీల్డింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ లయన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్ చుట్టూ ఆస్ట్రేలియా టీం లో ఉన్నటువంటి 11 మంది వికెట్లకు దగ్గర గా ఫీల్డింగ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంచెం సేపు వరకు వాషింగ్టన్ సుందర్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ధైర్యంగా ఆడగా చివరిగా మహమ్మద్ సిరాజ్ అవుట్ అయ్యాడు . కాగా ఈ మ్యాచ్లో టీమిండియా పైన ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదటగా టీమిండియా గెలుపు ఆశలు చూపించిన చివరికి ఓటమిని చవి చూసింది.
శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు సిరీస్లలో ఆస్ట్రేలియా రెండు , టీమిండియా ఒక మ్యాచ్ గెలవగా, ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో చివరిగా జరగబోయేటువంటి టెస్టు సిరీస్ లో టీమిండియా గెలిస్తే టెస్ట్ సిరీస్ సరి సమానంగా గెలిచిన వారవుతారు. లేదంటే ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది.