
మెటా కంపెనీ భవిష్యత్ టెక్నాలజీపై పెట్టిన ఆశలు ఈ దశలో పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న మెటా లక్ష్యానికి అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా గేమింగ్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని VR హెడ్‌సెట్స్, మెటా క్వెస్ట్ సిరీస్, అలాగే స్మార్ట్ గ్లాసెస్ ద్వారా మార్కెట్‌ను కట్టిపడేయాలనుకున్న ప్రయత్నాలు కంపెనీ ఆశించిన ఆదాయాన్ని తీసుకురాలేకపోయాయి. ఈ ప్రయోగాలు, భారీ పెట్టుబడులు మొత్తం కలిపి గత 4 సంవత్సరాలలో మెటాకు దాదాపు 70 బిలియన్ డాలర్ల పరాజయాన్ని మిగిల్చాయి. టెక్ దిగ్గజాల పోటీలో ముందుండాలని చేసిన ప్రయత్నమే మెటాకు భారమైపోయినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
మెటా ఏర్పాటు చేసిన రియాల్టీ ల్యాబ్స్ విభాగం ఈ నష్టాల్లోనే ఎక్కువ భాగం కలిగి ఉంది. మెటావర్సే కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని భావించినప్పటికీ, వినియోగదారులు, వ్యాపార సంస్థల నుండి వచ్చిన స్పందన మాత్రం అంత ఆశాజనకంగా లేకపోయింది. భారీగా పెట్టుబడులు వచ్చినా, అనుకున్న రేంజ్‌లో ఆదాయం రాకపోవడం కంపెనీకి ఆర్థికపరమైన భారాన్ని మోపింది. ఈ నేపథ్యంలో 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌పై 30 శాతం వరకు కోత విధించాలని మెటా నిర్ణయం తీసుకుంది. ఇది ఆ విభాగం ఎదుర్కొంటున్న ఒత్తిడి, కంపెనీ భవిష్యత్ ఆర్థిక విధానాల మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
బడ్జెట్ తగ్గింపుతో పాటు మరొక ప్రధాన పరిణామం లేఆఫ్స్. జనవరిలో రియాల్టీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగాల కోత జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ ఎకానమీ మందగమనం, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడంతో మెటా వినియోగదారులపై ఆధారపడే ఉత్పత్తులను వాయిదా వేసేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా MR గ్లాసెస్ లాంచ్‌ను కంపెనీ పొడిగించిన కాలానికి వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కొత్త ప్రీమియం ప్రొడక్ట్స్‌ను విడుదల చేస్తే అమ్మకాల ప్రమాదం అధికమని కంపెనీ అంచనా వేస్తోంది. మార్కెట్ వాల్యువేషన్ మళ్లీ పెరిగిన తర్వాతే ఈ ఉత్పత్తులను విడుదల చేద్దామని మెటా భావిస్తోంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో కంపెనీ వ్యూహాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: సోనియాగాంధీకి నోటీసులు ఇచ్చిన రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు





