
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలుగు యాంకరింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి యాంకర్ సుమకు పద్మశ్రీ ఇవ్వాలని కమెడియన్ హైపర్ఆది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాంకర్ సుమకు పద్మశ్రీ అవార్డు వస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తామని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో పద్మశ్రీ మరియు పద్మభూషణ్ లాంటి అవార్డులు ఎంతోమందికి వచ్చాయి. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు నటిగాను మరోవైపు యాంకరింగ్ గాను దాదాపు 20 సంవత్సరాల కు పైగా జీవితాన్ని ఇక్కడే గడిపారు అంటూ అది సుమపై ప్రశంసలు కురిపించారు. మరి రెండు దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేమను సొంతం చేసుకున్నటువంటి సుమకు కూడా ఇలాంటి అవార్డులు రావాలి అని.. ఆమె దీనికి అర్హురాలు అని అది స్పష్టం చేశారు. తన ఈ యాంకరింగ్ సుదీర్ఘ కెరీర్ లో ఆమె సాధించినటువంటి సేవలు, అంకిత భావం మరియు వినోదానికి ఈ పౌర పురస్కారం ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు అని అది వెల్లడించారు. ఆది చెప్పినట్టుగానే సుమకు పద్మశ్రీ లాంటి అవార్డులు ఇవ్వాలి అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి సుమకు పద్మశ్రీ అవార్డు ఇస్తారా?.. లేదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : ఆస్తులు విషయంలో గొడవలు రాకుండా ఉండాలి అంటే మహిళలు ఈ పని చేయాల్సిందే?
Read also : FIFA వరల్డ్ కప్ అర్హత సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన అతి చిన్న దేశం!





