
-
తాను ఫిట్‌గా ఉన్నానన్న స్పీడ్ స్టర్
-
ఈడెన్ గార్డెన్స్‌లో తన బౌలింగ్ అందరూ చూశారని చురక
-
ప్రస్తుతం రంజీ మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ షమీ
క్రైమ్‌మిర్రర్, స్పోర్ట్స్: టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు భారత సీనియర్ పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఘాటు కౌంటరిచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై అగార్కర్ వివరణ ఇస్తూ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు షమీని ఎంపిక చేయాలని భావించామని, అయితే అతడు ఫిట్‌గా లేని కారణంగా పక్కన పెట్టాల్సి వచ్చిందని అగార్కర్ తెలిపారు. ఫిట్‌గా ఉంటే తాము జట్టులోకి ఎందుకు తీసుకోమని ఎదురు ప్రశ్నించారు అగార్కర్.
కాగా, చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై షమీ స్పందించారు. తాను ప్రస్తుతం రంజీ మ్యాచ్‌లో ఆడుతున్నాని, ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ప్రదర్శనను అందరూ తిలకించారని షమీ చురకలంటించాడు. ఆ మ్యాచ్‌లో బెంగాల్ తరపున ఆడిన షమీ మూడు వికెట్లతో చెలరేగాడు. బెంగాల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అగార్కర్-షమీ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇవీ చదవండి