
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులకు పథకం వేస్తున్నాయన్న సమాచారంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలీస్థానీ, బంగ్లా టెర్రర్ నెట్‌వర్క్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. నిఘా సమాచారం ప్రకారం హర్యానా, పంజాబ్, ఢిల్లీ NCR, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖలీస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న గ్యాంగ్‌స్టర్లు కదలికలు పెంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఢిల్లీలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన నేపధ్యంలో కేంద్ర భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. రిపబ్లిక్ డే పరేడ్ మార్గాలు, ప్రజా సమూహాలు గుమిగూడే ప్రాంతాలు, రవాణా కేంద్రాల వద్ద బహుళ-స్థాయి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచడంతో పాటు, చెక్‌పోస్టులు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, స్పెషల్ ఫోర్సెస్ మోహరింపు కొనసాగుతోంది. భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
మేడారంలో వేడి నీటి బకెట్ 50 రూపాయలు.. వైరల్ అవుతున్న దృశ్యాలు?





