
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో కూడా గత కొద్దిరోజుల నుంచి తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర మరియు పశ్చిమ జిల్లాల్లో ఇవ్వాలా చలి మరింత తీవ్రంగా ఉండబోతుందిని వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. తెల్లవారుజామున 8:00 వరకు కూడా ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా 5 గంటల నుంచి 8 గంటల వరకు ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారో వారందరూ చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ తర్వాత జాబ్ చేయడానికి వెళ్లేటువంటి యువత కూడా ఈ చలి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలు
1. జగిత్యాల
2. కొమరం భీమ్
3. సిరిసిల్ల
4. సిద్దిపేట
5. మెదక్
6. సంగారెడ్డి
7. వికారాబాద్
8. అదిలాబాద్
9. నిజామాబాద్
10. కామారెడ్డి
పైన పేర్కొన్న ఈ 10 జిల్లాల్లో అత్యల్పంగా 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇవ్వాళ కూడా ఈ 10 జిల్లాలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా పడిపోతాయి అని తద్వారా ప్రజలందరూ తీవ్రమైన చలికి గురవ్వాల్సి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న కనిష్టంగా సిర్పూర్ లో 6.8 డిగ్రీలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా 10 నుంచి 15°C ఉష్ణోగ్రత ఉంటేనే చాలా చలిగా అనిపిస్తుంది. అలాంటిది 6.8 డిగ్రీలు అంటే ఎంత చలిగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. చలితో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నవంబర్ 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో… 22వ తేదీ నుంచి మరో మూడు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఈ వర్షాలు అలాగే చలి తీవ్రత పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read also : భక్తులతో కిక్కిరిసిపోయిన శబరిమల.. ఇబ్బందులు పడుతున్న చిన్నారి స్వాములు!
Read also : ఆంధ్ర పోలీస్ లా మజాకా… హిడ్మా మరణంలో ఏపీ సక్సెస్!





