క్రైమ్

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో సంచలన నిజం!

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం కేసులో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే సలీం ఆలయంలో దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ముత్యాలమ్మ గుడి దాడి పై రెండో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సురేష్ఇచ్చిన ఫిర్యాదుతో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాతో పాటు మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్ పై కేసులు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు.

దాడి చేసిన నిందితుడు సల్మాన్ హోటల్లో ఉన్నట్టుగా విచారణలో గుర్తించారు. ఈనెల ఒకటి నుంచి 31 వరకు మెట్రో పోలీస్ హోటల్లో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు మునావర్ జామ. హిందూ మతంపై రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 151 మంది హోటల్లో అకామిడేషన్ కల్పించినట్టు తేల్చారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు సలీంతో పాటు 140 మంది బస చేసిన మెట్రో పోలీస్ హోటల్ ను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు నార్త్ జోన్ డీసీపీ హోటల్ యజమానులతో సమావేశమయ్యారు. ఇకపై పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కాన్ఫరెన్స్ లు నిర్వహించరాదని సూచించారు. అనుమానిత వ్యక్తులకు హోటల్ రూమ్స్ కేటాయించవద్దని డీసీపీ హెచ్చరించారు.

Back to top button