 
						క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా, చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినా సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు ప్రతిరోజూ మాదిరిగానే ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేసి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశారు.
Also Read: జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేతల వినూత్న ప్రచారం..!
ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇది రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగి ఉండవచ్చని స్థానికులు, పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు.సామినేని రామారావు గతంలో పాతర్లపాడు గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ హత్యపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
Also Read: జగన్ గ్రాఫ్ ను ఆకాశానికి ఎత్తేయాలనుకున్నారు.. కానీ చివరికి?
 
				 
					
 
						