
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు(ఎం):-యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర శాస్త్రి జనవరి 29 తేదీ నుండి పిబ్రవరి 01తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఏనుగు సుగంధిని సురేందర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ ఈ జనవరి 29న ఉత్సవాలు ప్రారంభిస్తామని 30న అమ్మవారికి కుంకుమార్చన హోమాలు, 31న చండీ హోమం ఊయల సేవ, ఫిబ్రవరి ఒకటిన బండ్లు బోనాలు అమ్మవారి సేవ జరుగుతాయని ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను దిగ్విజయం చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతం చేయటానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, బిజేపి మండల అధ్యక్షులు గజరాజు కాశీనాథ్,బొబ్బిలి ఇంద్రారెడ్డి,ఉప సర్పంచ్ మజ్జిగ నరేశ్,బిఆర్ఎస్ నాయకులు కోరె బిక్షఫతి,సోలిపురం అరుణ,కోల లక్ష్మయ్య,గర్దాసు లింగయ్య, సిపిఐ గ్రామ కార్యదర్శి నర్సయ్య, పురుషోత్తం,ర్యాగటి మత్యగిరి, తదితరులు పాల్గొన్నారు.
Read also
యాదగిరిగుట్ట మండలం,రాళ్ల జనగాం గ్రామంలో పులి సంచారం.. దూడ మృతి
ఆ రోజున పైకి విసిరే వస్తువులు కిందపడవా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారు?





