
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా పర్వేద ఉన్నత పాఠశాలలో క్విజ్ , నాటకాలు, నృత్య ప్రదర్శన వంటి వివిద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతులు ప్రకటించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత సైంటిస్టులు ఆవిష్కరించిన అంశాలను తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.మవిజ్ఞాన శాస్త్రం మన జీవితంలో ఒక భాగని విజ్ఞాన శాస్త్రం లేకుండా మన జీవితాన్ని విడదీయలేమని విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకతను సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి కార్యక్రమం నిర్వహణలో వివరించారు.
చౌటుప్పల్ లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన… ఇంటింటికి తిరిగి సమస్యలపై ఆరా
ప్రకృతికి అభివృద్ధికి మనం తోడ్పడితే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుందని అన్నారు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడనట్లైతే మనకొచ్చే అనర్ధాలను నృత్య రూపకంగా వివరించారు. 9వ తరగతి విద్యార్థులచే విద్యార్థుల బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించి వారి వారి బ్లడ్ గ్రూపులను తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వనాథ్, బసవరాజ్, కవిత, కాంచన లక్ష్మి, రాజేందర్, నందు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మూడు లక్షల కోట్లు దాటిన బడ్జెట్… పవన్ శాఖలకు భారీ నిధులు?
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచేది వీళ్లే.. క్రైమ్ మిర్రర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్