క్రైమ్

SBI బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో స్కామ్.. చివరికి ఏమైందంటే..?

Lucky Bhaskar : ఈ మధ్యకాలంలో కొందరు సినిమాలు చూసి వాటి ద్వారా ఇచ్చే మంచి మెసేజ్లను మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు గాని స్కాం, థ్రిల్లర్ సినిమాలను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో ఏకంగా సినిమాల్లో మాదిరిగానే దొంగతనాలు, దోపిడీలు, ఆర్థిక మోసాలు, వంటివి చేయడానికి అలవాటు పడుతున్నారు. రీసెంట్గా ఓ బ్యాంకు ఉద్యోగి కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగానే బ్యాంకులో స్కామ్ చేసి పరారైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రవీందర్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. అయితే రవీందర్ క్యాషియర్ కావడంతో డైలీ లక్షల రూపాయలు లెక్కిస్తూ ఉంటాడు. దీంతో రవీందర్ కి డబ్బు పై ఆశ కలిగి దుర్బుద్ధి పుట్టింది. దీనికి తోడు ఆ మధ్య వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ను చూసి బ్యాంకు క్లోజ్ చేసే టైం కి కొంత డబ్బుని తీసుకొని వ్యక్తిగత పనులకు వాడుకొని మళ్లీ మరుసటి రోజు బ్యాంకు తెరిచే సమయానికి అక్కడే ఉంచేలా ప్లాన్ చేశాడు. ఇలా సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు పైగా వాడుకొని మళ్ళీ బ్యాంకులో పెట్టకుండా బ్యాంక్ ఆడిట్ లో తేలింది. ఇంకేముంది విషయం ఆడిటర్లకి దృష్టికి వెళ్ళింది. కానీ అంతకుముందే ఈ విషయం క్యాషియర్ రవీందర్ చెవి వినపడడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు

అయితే నగదు మాత్రమే కాదు కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం వెండి వంటివి కూడా కనిపించడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలీసులు రవీందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే పరారీలో ఉన్న రవీందర్ ని పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్లు, రికార్డులు వంటివి ఆధారంగా చేసుకుని వెతుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button