క్రైమ్తెలంగాణ

శాలివాహనకు శనిగ్రహం.. కబ్జా కోరల్లో విద్యాలయం..!

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- భూముల రేట్లకు అడ్డగోలు రెక్కలు రావడంతో, మనుషుల మధ్య మానవత్వం, బంధుత్వాలు మంట కలిసి పోతున్నాయి నేటి సమాజంలో.. అప్పటి పెద్దలు పేదలకు పంచిన భూములను, ప్రస్తుతం వారసులు వచ్చి దౌర్జన్యం చెయ్యడం, ఇప్పటికే ఈ పరిస్థితి మండలంలో ఆయా చోట్ల దర్శనమిచ్చాయి..! అట్టముక్కను పట్టుకొని సముద్రం ఈదినట్లు ఉంది, ప్రస్తుత మర్రిగూడ పెద్దల పరిస్థితి.. ధరణిలో మాకు పట్టాపాస్ పుస్తకాలు ఉన్నాయని, ఈ భూమి మా పూర్వికుల నుండి వస్తుందంటూ, కొన్ని కుటుంబాలు పూనుకోవడంతో, ఆ కాస్త పంచాయతీ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..! గత కొన్ని ఏళ్ల నుండి, ఎంతోమందికి విద్యాభ్యాసం చేసిన శాలివాహన జూనియర్ కళాశాల, నేడు కబ్జా కోరల్లో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

కట్టిన కట్టడాలకు కొన్ని ఏళ్ల నుండి గ్రామ పంచాయతీలో పన్ను కడుతున్నప్పటికీ, అవేమీ లెక్క లేవంటూ కళాశాల కబ్జాకు పూనుకున్నారు కొంతమంది..!? ఇదంతా మాదే అంటూ, చివరికి నక్ష బాటను కూడా మింగేసే పనిలో పడ్డారు వీరు.! ఖాళీగా ఉండడంతో రోడ్డుకు మొదటి బిట్టు కావడంతో, ఇదే అదునని భావించిన వ్యక్తులు, ధరణిలో మాకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయని, ఈ భూమి మా పూర్వీకుల నుండి వస్తుందని, ఈ భూమి మాదేనంటూ, కొన్ని ఏండ్ల క్రితమే నిర్మాణం చేసినటువంటి, శాలివాహన కళాశాల భవనాలను సైతం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు సదరు వ్యక్తులు..! దీని కోసం కల్వర్ట్ ను సైతం నేల మట్టం చేసి, రెవిన్యూ అధికారులు నాటిన గుర్తులను కూడా తీసి పక్కన పడేసారు..!ఆ భూమి కొనుగోలు చేసి కళాశాల కట్టినది అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ..? ఆ పెద్దల దౌర్జన్యం ముందు ఏది ముందుకు రావటం లేదని అంటున్నారు స్థానికులు..!? నిజానికి పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ, కబ్జాలో ఉన్న వారిని కాళీ చేయించే అధికారం ఎవ్వరికి ఉంది..? కేవలం కోర్టు ఉత్తర్వులు తప్ప, అధికారులు ఈ సాహసం చెయ్యటం చట్ట విరుద్ధమనే చెప్పుకోవాలి..! భూమి వారిదే అయితే కబ్జాలో ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు లేరు..? కబ్జాలో లేకపోతే ప్రస్తుతం కబ్జా ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది అనే విషయాలు, చట్టానికి లోబడి ఉండాలని మండల వాసులు అనుకుంటున్నారు..!? మండల తహసీల్దార్ సైతం వాస్తవాలను పై అధికారులకు నివేదిక రూపంలో అందిస్తామని చెబుతున్నారు..!? తమదే భూమి అని వాదించే వారు.. న్యాయంగా కోర్టును ఆశ్రయించాలే తప్ప, ఇలా దౌర్జన్యంగా కబ్జాకు ప్రయత్నం చేయకూడదంటున్నారు..!? వీరిలా అందరూ చేస్తే ఇంకా చట్టానికి విలువేముందని, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని అన్ని చేయగలమని అనుకుంటే ఎలా..! అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు..!? ఈ కళాశాల యజమాని సతీష్ చందర్ రావు, ఈనాడు రిపోర్టర్ గా పని చేసిన సమయంలో, ఎవ్వరూ కూడా కబ్జాకు ప్రయత్నం చెయ్యలేదని, ఆయన తధనంతరం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు మండల ప్రజలు.. ఈ తతంగమంతా చూసిన స్థానికులు, పూర్వ విద్యార్థులు శిధిలావ్యస్థలో ఉన్న కళాశాల, ఎలా ఉన్నా పర్లేదు కానీ, పడగొట్టకుండా అడ్డుగా ఉంటామంటున్నారు.. నక్షభాట కబ్జా తప్పదని పెద్దలు అనుకుంటే, ఆ ప్రదేశంలో అంబేద్కర్ భవనం కట్టుకుంటామని అంటున్నారు అంబేద్కర్ అభిమానులు.. చూడాలి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనేది…

“ఈ సమస్యపై మరో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా పూర్తి వివరాలు మీ ముందుకు..”

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

Read also : ఇంట్లో ఘోరంగా అవమానించే వాళ్ళు.. రవి సంచలన వ్యాఖ్యలు!

Read also : ఏపీలో భారీ వర్షాలు.. అల్పపీడనమే కారణం.. ఈ జిల్లాలో అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button