
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి సత్య సాయి బాబా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ప్రముఖ సెలబ్రిటీ లందరూ కూడా అతనిని స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. నాకు సాయి పల్లవి అని పేరు పెట్టింది సత్యసాయిబాబా అని సాయి పల్లవి అన్నారు. అలాగే మా అమ్మ మరియు తాతయ్య చిన్నప్పటి నుంచి సాయిబాబాకు విపరీతమైన భక్తులు అని తెలిపారు. పుట్టపర్తి సత్యసాయిబాబా దీవెనలే నాకు శ్రీరామరక్షని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటినుంచి నేను కూడా సాయిబాబా భక్తిరాలి నేనని… ఆయన చెప్పిన ప్రతి మాట తనలో ధైర్యం నింపాయని చెప్పుకొచ్చారు. చిన్నప్పటినుంచి క్రమశిక్షణ, ధ్యానం మరియు ప్రశాంతత లాంటివి అన్నీ కూడా సత్య సాయి బాబా నుంచే నేర్చుకున్నాను అని సాయి పల్లవి తెలిపారు. కాగా సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపద్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రధాని మోడీ సైతం పుట్టపర్తి సత్య సాయి బాబా సిద్ధాంతాలను మెచ్చుకున్నారు.
Read also : పిల్లలు అతిగా సెల్ ఫోన్స్ చూస్తే వారి భవిష్యత్తుకే ప్రమాదం!
Read also : బ్రేకింగ్ న్యూస్… రాజకీయ నేతల వాట్సప్ గ్రూపులు హ్యాక్?





