క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. సర్పంచులు మరియు వార్డు సభ్యులు డిసెంబర్ 22, 2025 (సోమవారం) నాడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబర్ 20న (శనివారం, పాడ్యమి) శుభ ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు చేపట్టడం మంచిది కాదని పలువురు ప్రజా ప్రతినిధులు మరియు అభ్యర్థులు చేసిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 17న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది, నేడు (డిసెంబర్ 17) మూడో విడత ఫలితాలు వెలువడుతున్నాయి.





