
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పెబ్బేరు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 17 గ్రామ పంచాయతీలలో ఎన్నికలలో గెలుపొందారు. సోమవారం 20 గ్రామపంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఆయా ఆయా గ్రామ పంచాయతీల దగ్గర గ్రామపంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. సుగూరు సర్పంచ్ గునేమోని యాదమ్మ పరశురాం..ఉప సర్పంచ్ బత్తిని హుస్సేన్, వార్డు సభ్యుల తో పంచాయతీ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గునేమోని యాదమ్మ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుగూరు గ్రామ ప్రజలకు నాకోసం ఎన్నికలో కష్టపడి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పెద్దల సహకారంతో పార్టీ నాయకులతో మమేకమై సుగూరు గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడుతానని ఆమె తెలిపారు. గ్రామంలో పరిశుద్యం.. మంచినీళ్ల సరఫరా, వీధి దీపాలసమస్యలు ఉంటే నా దృష్టికి తేవాలి అని ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,ప్రజలు బారి ఎత్తున పాల్గొన్నారు.
Read also : Viral News: బిడ్డ బతికి ఉండగానే అంత్యక్రియలు.. కారణం ఏంటంటే?
Read also : Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్.. మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!





