
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) పల్లెర్ల గ్రామంలో గల వలిగొండ – తొర్రూర్ రోడ్డు వైపు వెళ్లే బిటి రోడ్డు చాలా గుంతలు ఉండడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పల్లెర్ల గ్రామ సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్ శుక్రవారం రోజున పల్లెర్ల నుండి వేములకొండ ఎక్స్ రోడ్డు వరకు మొరం మట్టితో గుంతలను పూడ్చి చదును చేయించడం జరిగింది. దీంతో సర్పంచ్ నరసింహ గౌడ్ కు స్థానిక ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
Read also : వసంత పంచమి రోజున అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం
Read also : ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు





