
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మెయిన్ రోడ్డు నుండి మార్కెట్ యార్డు వరకు మంజూరైన రోడ్డు పనులు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు అదేవిధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలకు జరిగిన సంఘటనలను గమనించిన ఆత్మకూరు(ఎం)గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ రోడ్డు కాంట్రాక్టర్ ని పిలిపించి మాట్లాడి ఇన్ని రోజులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్ అఖిలపక్షం నాయకులు,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, మాజీ సర్పంచ్, జడ్పిటిసి, ప్రతి కంఠం పూర్ణచందర్ రాజు, కోరే బిక్షపతి, రచ్చ గోవర్ధన్,మజ్జిగ నరసయ్య,ఎలిమినేటి ఎలేందర్, నాతి బిక్షపతిగౌడ్,నాతి మల్లికార్జున్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Read also : ఈనెల చివరిలో ఓటీటీ లోకి హిట్ సినిమా
Read also : ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. చాలా రోజులకు మెరుగుపడిందిగా?





