
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- అణగారిన జీవితాలకు అక్షరాలను పరిచయం చేసిన అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే అని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ… తన భర్తనే గురువుగా మార్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా ఎదిగారు. ప్రతి ఒక్క విద్యార్థి సావిత్రి బాయిపులే ను ఆదర్శంగా తీసుకొని ,మంచిగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు.
Read also : తెలంగాణ డీజీపీతో పెన్ కౌంటర్ సీఎండీ మర్యాద పూర్వక భేటి
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలప్రసాద్ ఆధ్వర్యములో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ దంపతులను పాఠశాల బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రావాల్సిన హక్కులకోసం పోరాడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అన్నారు.. గొప్ప స్ఫూర్తి ప్రదాత అని గుర్తు తెచ్చారు. సామాజిక సేవకులు లయన్స్ క్లబ్ మునుగోడు సెక్రటరీ పాలకొల్లు నరసింహ గౌడ్ మాట్లాడుతూ అణగారిన జీవితాలకు అక్షరాలను పరిచయం చేసిన అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే అన్నారు. బడుగుల బ్రతుకులో చైతన్యం నింపిన తేజోమూర్తి అని, గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు.. పాఠశాల అభివృద్ధికి తన వంతు తోడ్పడతానన్నారు.
Read also : అరుదైన దృశ్యం.. మంచు గుప్పిట్లో రామకృష్ణాపూర్ పట్టణం
మహిళా ఉపాధ్యాయులు జి గీత వాణి ,యల్ హేమలత ,హీనా కీసర్, జి శైలజ, వీరమల్ల అపర్ణ,భవాని, లక్ష్మీ ప్రసన్న, నవ్యశ్రీ ,పుణ్యవతి, త్రివేణి ,నవ్య లను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ,వార్డు సభ్యులు భీమనపల్లి పవిత్ర కిరణ్, పందుల రంజిత్, శ్రీరామోజు వెంకటేశ్వర్లు,ఉప్పునూతల శ్రీశైలం, పందుల లింగస్వామి, సద్దల శ్రీశైలం, ఉపాధ్యాయులు కే సత్తిరెడ్డి డి వెంకటేశ్వర్లు,శేఖర్, చంద్రం ,రాజేశ్వర్, ఎండి హసన్ కలీం, రత్నయ్య బాబురావు, ప్రదీప్, విద్యాసాగర్ ,రాజు ,పాఠశాల విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.





