Friday, March 20, 2026
Homeతెలంగాణఏంజేపి బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్

ఏంజేపి బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగది,స్టోర్ రూమ్ లోని సరుకులు,బియ్యం,నూనె, పప్పు దినుసులు,వంట సరుకులను,మెనూ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్దులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. పాఠశాలలో జరిగిన మాక్ డ్రిల్ ప్రేర్ లో పాఠశాల విద్యార్థులు సర్పంచ్ కు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్ధుల నుండి సర్పంచ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్ తీర్చదిద్దేదీ పాఠశాలలో ఉపాధ్యాయులే అన్నారు. విద్యార్దులు కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి తమ తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.కచ్చితంగా మెనూ పాటించాలన్నారు. పాఠశాలలో మెరుగయిన సౌకర్యాలు కల్పించడానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తామన్నారు..
పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యరాణి,వార్డు సభ్యులు పందుల గంగాధర్ పాఠశాల సిబ్బంది విద్యార్దులు ఉన్నారు.

Read also :-

ఆంధ్రాలో అగ్గిరాజుకుంటున్న రాజకీయాలు, నాయకుల ఇళ్లపై దాడులు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి?

మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments