
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలోని మూడో వార్డులో గల శీలోన్ బావి దగ్గరికి వెళ్లే రోడ్డు గత రెండు సంవత్సరాల నుండి అసంపూర్ణంగా ఉండి రోడ్డుకి ఇరువైపులా విపరీతమైన కంపచెట్లు ఉండడం వలన గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ కి విన్నవించగానే వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్,వార్డు సభ్యులు పైళ్ల ప్రశాంత్, జిల్లాల మల్లారెడ్డి,కందడి రామిరెడ్డి, కందడి నరసింహారెడ్డి,కందడి వెంకట్ రెడ్డి,జక్క యాకోబ్ రెడ్డి, కొల్లు నాగరాజు,కోల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Read also : మునుగోడులో సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం
Read also : Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక!





