
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
నేటి నుంచి కాలేశ్వరం సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులు కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు, నేటి నుంచి 26 వరకు జరిగే కాలేశ్వరం పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, రోజుకు లక్షా నుంచి లక్షల వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవి చాలా ప్రత్యేకం అని పెద్దలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. ఏర్పాట్లు చేశారు. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో.. ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తుంటారని పూజారులు చెబుతున్నారు. సరస్వతీ నది పుష్కరాలకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. బుధవారం నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాక 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నామని అధికారులు తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..
నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఇప్పుడు జిల్లా వ్యవసాయ అధికారిగా వైభోగం?!