మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యా సంస్థలు అన్నిటికీ
సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై మొదటగా కాస్త గందరగోళం అనేది ఏర్పడింది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా సంక్రాంతి సెలవులు పై క్లారిటీ ఇచ్చాయి. స్కూలుకు మరియు జూనియర్ కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రేవంత్ పెట్టే లొట్ట పీసు కేసులకు నేను భయపడను: కేటీఆర్
మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అలాగే జూనియర్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 నుంచి 16 తారీకు వరకు సెలవులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్లకు ఈనెల 10వ తారీకు నుంచి 19వ తారీఖు వరకు సెలవులను ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 11 నుంచి 15వ తారీకు వరకు సెలవులు అనేవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జూనియర్ కాలేజీలకైతే సెలవులు ప్రకటించలేదు. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజీలకు సెలవు దినాల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
జగన్ కు గుడ్ న్యూస్!… కోర్టు నుండి ఉపశమనం?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. దేశ విదేశాల నుంచి ఈ సంక్రాంతి పండుగకు చాలామంది ప్రయాణాలు సాగిస్తున్నారు.ఈ సెలవులు కారణంగా చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించాల్సి ఉండగా అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు ప్రయాణం చేస్తారని అధికారులు తెలియజేశారు.