
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత యువ వికెట్ కీపర్ సంజు సాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. సంజు సాంసన్, రవీంద్ర జడేజాను CSK & RR జట్లు ట్రేడింగ్ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో భారీగానే ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంసన్ పుట్టిన రోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక స్పెషల్ ట్వీట్ చేసింది. “నీకు మరింత శక్తి చేకూరాలి సంజు” అంటూ.. విష్ యు సూపర్ బర్త్డే అని అతని ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. రాబోయే ఐపీఎల్ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకోనుంది అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇటువంటి ట్వీట్ మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో సంజు సాంసన్ చెన్నైకి రావడం కన్ఫర్మ్ అయిందంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి సంజు సాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ తాజాగా ఆ జట్టు నుంచి సాంసన్ బయటకు వెళ్తున్నట్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఇంత బాధకు గురైన మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధోని తరువాత సంజు శాంసన్ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తారు అని ఇప్పటికే ప్రతి ఒక్కరికి అర్థం అయింది.
Read also : జూబ్లీహిల్స్ లో ఈ రెండు రోజులు అన్ని కార్యాలయాలకు సెలవు
Read also : వరల్డ్ కప్ విన్నర్ కు వెస్ట్ బెంగాల్ అరుదైన గౌరవం… రిచా పేరిట స్టేడియం ఏర్పాటు?





