క్రీడలు

సంజు సాంసన్ అవుట్… కొత్త కెప్టెన్ రేసులో యువ క్రికెటర్స్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026వ సంవత్సరానికి గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి కెప్టెన్ సంజు సాంసన్ వీడడం అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే సంజు సాంసన్ బదులు కెప్టెన్ గా ఎవరు అవుతారో అని ప్రతి ఒక్కరు కూడా లోలోపల ప్రశ్నలు వేసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా జట్టులోని యువ క్రికెటర్స్ అయినటువంటి యశస్వి జైస్వాల్ మరియు దృవ్ జూరల్ వీరిద్దరూ కూడా కెప్టెన్ రేసులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ రేసులో ఈ యువ క్రికెటర్స్ మాత్రమే ముందు వరుసలో ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరోవైపు రాజస్థాన్ జట్టులో మిడిల్ ఆర్డర్ లో కీలకమైన యువ క్రికెటర్ రియాన్ పరాగ్ పేరు అసలు వినిపించడం లేదు. కాగా రాజస్థాన్ తో ట్రేడ్ డీల్ లో భాగంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిద్ధమైనట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జడేజా ఇన్స్టా అకౌంట్ కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఎప్పటినుంచో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాడుతున్నటువంటి రవీంద్ర జడేజా అ జట్టు నుంచి వైదొలిగితే మాత్రం ఫ్యాన్స్ మధ్య విపరీతమైన వార్ జరిగే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read also : విదేశాలకు వెళ్ళిపోతున్న కొడుకులు.. ఒంటరిగా కుమిలిపోతున్న తల్లిదండ్రులు!

Read also : ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయి తనిఖీలు.. భయాందోళనకు గురవుతున్న ప్రజలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button