వైరల్సినిమా
Trending

డైరెక్టర్ తో సమంత పెళ్లి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- టాలీవుడ్ నటి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అసోసియేషన్ మీడియాలో ఇవాళ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. డైరెక్టర్ రాజు నిడమోరుతో ఆమె ఇవ్వాళ కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇన్ని రూమర్స్ వస్తున్న కూడా ఈ రూమర్స్ పై ఒక వైపు సమంత మరో వైపు రాజ్ మాత్రం ఎటువంటి విధంగా స్పందించడం లేదు. ఇక ఈ రూమర్స్ అన్నిటికి బలమైన కారణం ఉంది. అదే డైరెక్టర్ రాజు నిడమోరు మాజీ భార్య శ్యామలాదేవి. ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన స్టోరీ ఈ రూమర్స్ కు దారి తీసింది. అసలు ఈ పోస్టులో ఏముంది అంటే.. తెగించిన వ్యక్తులు మాత్రమే అలాంటి పనులు చేస్తారు అని ఆమె ఒక కొటేషన్ పెట్టారు. ఈ వ్యాఖ్యలే రాజ్ మరియు సమంత పెళ్లి వార్తలతో జతకట్టేలా సందేహాలు పెంచుతోంది. కాగా గతంలో నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య శోభిత ను పెళ్లి చేసుకోగా.. సమంత మాత్రం సింగిల్ గా ఉంటూ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్లు కొన్నిసార్లు కనిపించారు. దీంతో అసలు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి రోమర్స్ అనేవి నిజమా?.. లేక అబద్ధమా?.. అనేది స్పష్టత అయితే రావట్లేదు. రాజ్ మాజీ భార్య చేసినటువంటి పోస్ట్ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో కొత్త చర్చలకు దారితీస్తోంది. దీంతో సమంత అభిమానులు అందరు ఆందోళనలో ఉన్నారు.

Read also : ఇదే ఊపులో ఉంటే 100 సెంచరీలు ఖాయం..?

Read also : ఒక హిడ్మా ను చంపితే 1000 మంది, ఒక ఐ బొమ్మ రవిని చంపితే 100 మంది పుట్టుకొస్తారు : CPI నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button