
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకులు తర్వాత డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ సమంత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగిన క్షణం నుంచి భార్య ఇంటి పేరు పూర్తిగా మారిపోతుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం భర్త ఇంటి పేరును భార్య కూడా తన పేరు ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలోనే హీరోయిన్ సమంత కూడా రాజ్ ఇంటిపేరును ముందు పెట్టుకోబోతున్నట్లు సమాచారం. సమంతా అన్ని సోషల్ మీడియా ఎకౌంట్లతో పాటు ప్రస్తుతం హీరోయిన్ గా సమంత చేస్తున్న “మా ఇంటి బంగారం” సినిమా టైటిల్స్ లోనూ సమంత నిడమోరు పేరును అభిమానులకు పరిచయం చేయాలి అని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అయితే వీరిద్దరి పెళ్లి అయిన తర్వాత సమంత తన పేరును మార్చుకుంటుందా?.. లేదా?.. అని చాలా సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ మెదిలాయి. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం పేరు భార్య పేరుకు భర్త ఇంటి పేరు ఉండాలి కాబట్టి ఆ పేర్లను మార్చబోతున్నట్లుగా సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతుంది.
Read also : గద్దెలపైకి సారలమ్మ… నేడు సమ్మక్క రాక..!
Read also : నెల రోజుల పాటు వీటిని మానేస్తే అద్భుత ప్రయోజనాలు





