
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇవాళ ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లుగా సినీవర్గాలు తెలిపాయి. అలాగే పెళ్లి చేసుకున్న అనంతరం సమంత పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేయగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసినా సమంత అభిమానులు అందరూ కూడా సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఉదయం నుంచి సమంత అలాగే డైరెక్టర్ రాజు పెళ్లి చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. రాజ్ మాజీ భార్య తన సోషల్ మీడియా ఎకౌంట్ లో తెగించిన వ్యక్తులు మాత్రమే అలాంటి పనులు చేస్తారు అంటూ ఆమె పెళ్లి గురించి ప్రస్తావించిన సందర్భంలో అవి అబద్దమో లేక నిజమా అనేవి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కానీ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారని అయితే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన రెండు మూడు గంటలకే నిజంగానే సమంత అలాగే డైరెక్టర్ రాజు ఇద్దరు కూడా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరికి టాలీవుడ్ ప్రముఖ నటులు విషెస్ చెబుతున్నారు.
Read also : Good News: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ..!
Read also : 9 బంతుల్లోనే 7 సిక్సర్లు.. T10 లో టిమ్ డేవిడ్ విధ్వంసం!





