
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భారతదేశ ప్రజలకు జీఎస్టీ కి సంబంధించి శుభవార్త తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. త్వరలోనే జీఎస్టీ సంస్కరణలు తీసుకువస్తామని.. ఇందువల్ల కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అయితే నరేంద్ర మోడీ చేసిన ఈ కీలక ప్రకటన వాణిజ్య రంగంపై పూర్తిగా ప్రభావం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దీపావళి నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో.. అప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి ఆసక్తి చూపరు. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత.. ధరలు ఎక్కువ మొత్తంలో తగ్గుతాయి కాబట్టి.. దీపావళి తర్వాత నుంచే ఎక్కువ కొనుగోళ్లకు సామాన్య ప్రజలు కూడా మొగ్గు చూపుతారని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఖచ్చితంగా దీపావళి పండుగ వరకు అమ్మకాలు అనేవి భారీగా పడిపోతాయి. వివిధ కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
Read also : డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు.. ఆడియో కాల్ లీక్
కాగా స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళికి సామాన్య ప్రజలకు డబుల్ దీపావళి బొనాంజా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జీఎస్టీ పై హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని.. త్వరలోనే రివ్యూ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే అంటే దీపావళి సమయానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టి అమలులోకి తీసుకువచ్చి.. సామాన్య ప్రజలపై ఉన్నటువంటి పనుల భారాన్ని తగ్గిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఫ్రిజ్ లు అలాగే వాషింగ్ మిషన్లు 28% నుంచి 18% వరకు ఉంటుందని తెలిపారు. త్వరలోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం కూడా తీసుకోనుంది.
Read also : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి పదవిగా అభ్యర్థి తిరుచీ శివ!