
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- హిందువులు జరుపుకునేటువంటి అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలోని శివుడి క్షేత్రాలకు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు బెంగళూరులో మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పూట బెంగళూరులో జంతువు వద అలాగే మాంసం అమ్మకాలను నిషేధిస్తూ “గ్రేటర్ బెంగళూరు అథారిటీ” (GBA) కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు అథారిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని చికెన్ మటన్, చేపల దుకాణాలు మరియు కబేలాలను శివరాత్రి ఒక్క రోజున 24 గంటల పాటు మూసివేయాలి అని ఆదేశాలను జారీ చేసింది. మహాశివరాత్రి రోజున హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండే విధంగా.. సాంస్కృతిక ఆచారాలు అలాగే మతపరమైన సెంటిమెంట్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము అని గ్రేటర్ బెంగళూరు అథారిటీ తెలిపింది. కాబట్టి ఆ రోజున ఎవరూ కూడా ఈ ఆదేశాలను ఉల్లంఘించి ముందుకు సాగకూడదు అని.. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటాము అని తెలిపింది.
సీఎం ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం
బ్యాలెట్ బాక్స్‌లో పెన్షనర్ ఆవేదన పత్రం..!









