
సజ్జల రామకృష్ణారెడ్డి… గత వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు. జగన్ కోటరీలో ముఖ్య నాయకుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… ఆయనదే హవా. ఆయన ఎంత చెప్తే అంత. విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం కావడంలో… సజ్జల పాత్ర కూడా ఉందన్నది బహిరంగ రహస్యం. పవర్ చేతిలో ఉనప్పుడు.. రాష్ట్రమంతా తనదే అనుకున్నట్టు ఉన్నాడు.. పాపం సజ్జల. ఎస్టేట్ కోసం అటవీ భూమిని కూడా స్వాహా చేసేశాడు. తమకు ఎదురేముంది…? అడిగే వారు ఎవరున్నారు..? 30ఏళ్లు అధికారం వైసీపీదే అన్న భ్రమలో ఉండి… అందినకాడిగి లాగేద్దామనుకున్నాడే సజ్జల. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది… స్వాహా చూసిన భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే… సజ్జల రామకృష్ణారెడ్డికి.. కూటమి ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకేదిన్నె మండలంలో సజ్జల కుటుంబానికి 184 ఎకరాల్లో ఒక ఎస్టేట్ ఉంది. ఆ 184 ఎకరాల ఎస్టేట్‌లో 63 ఎకరాలకుపైగా భూమిని సజ్జల ఫ్యామిలీ ఆక్రమించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. ఈ భూమిపై సర్వే చేయించింది. ఈ సర్వేలో.. సజ్జల కబ్జా బాగోతం బయటపడింది. సీకేదిన్నె పరిధిలోని సర్వే నెంబర్ 1559 నుంచి 1627, 1629లో… సజ్జల కుటుంబసభ్యులకు భూములు ఉన్నాయి. వీరి భూమికి ఆనుకుని అటవీ భూములు కూడా ఉన్నాయి. ఈ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములు, చెరువు కుంటల భూములు ఉన్నాయి ఉన్నాయి. వీటిలో 52.40 ఎకరాలను సజ్జల ఫ్యామిలీ ఆక్రమించేసింది. ఆ భూములను తమ ఎస్టేట్‌లో కలిపేసుకుంది. ఆక్రమించిన భూముల్లో అరటి, బొప్పాయి, జామతోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కొంత భూమిలో గెస్ట్‌హౌస్‌లు, అదనపు గదులు నిర్మించుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో… కూటమి ప్రభుత్వం సర్వే చేయించింది.
సజ్జల రామకృష్ణారెడ్డి చెందిన ఎస్టేట్‌లో 63 ఎకరాలు ఆక్రమించినట్టు అధికారులు సర్వేలో తేల్చారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని.. హెచ్చరికల బోర్డులు పెట్టారు. 63 ఎకరాల్లో 52.40 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్. ఈ భూమిని స్వాధీనం చేసుకుని.. అటవీశాఖ అధికారులకు అప్పగించి ప్రభుత్వం. దీంతో.. భూకబ్జా కేసులో అడ్డంగా బుక్కయ్యారు సజ్జల కుటుంబసభ్యులు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు.