ఆంధ్ర ప్రదేశ్

సాగర్ TO శ్రీశైలం.. రేపటి నుంచే ప్రారంభం!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- పర్యాటక ప్రాంతంగా శ్రీశైలం ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎవరైతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. రేపటి నుంచి నాగార్జునసాగర్ మరియు శ్రీశైలం మధ్య లాంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కూడా లాంచ్ లో ప్రయాణం అనేది సూపర్ గా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ లాంచి ప్రయాణం రేపటినుండి అయితే ప్రారంభం అవుతుంది అని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రయాణం చేయాలంటే పెద్దలకు వన్ వే అయితే 2000.. రెండు వైపులా ప్రయాణానికి అయితే 3250గా టికెట్ రేట్లను ప్రకటించారు. ఐదు నుంచి పది సంవత్సరాల పిల్లలకు వన్ వే 1600 రూపాయలు, రెండు వైపులా ప్రయాణాలు చేయాలంటే 2600 రూపాయలుగా నిర్ణయించారు. కాబట్టి ఎవరైతే పర్యాటకులు ఉంటారో ఒకసారి ఈ నది మీద, కొండల మధ్య ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. మీరు కన్ఫామ్ చేసుకొని ఈ లాడ్జిలో ప్రయాణం చేయాలని అనుకుంటే టికెట్ల బుకింగ్ కోసం https://tgdc.in/home వెబ్సైట్ ను సంప్రదించాలి అని అధికారులు సూచించారు. కాబట్టి చాలా రోజుల తర్వాత ప్రారంభమైన ఈ సర్వీస్ ను టూర్ లను ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ లాంచి ప్రయాణాన్ని ఒక్కసారైనా వీక్షించాలని సూచిస్తున్నారు.

Read also : Politics: రాజీనామా వైపే దానం నాగేందర్ మొగ్గు చూపుతారా..?

Read also : మార్ఫింగ్ ఫోటోలు ఎంతగానో బాధపెట్టాయి.. నటి కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button